రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన కృష్ణమోహన్, దుండ్ర కుమారస్వామి
ప్రముఖ సినీ హీరో, నటుడు ఇంట్లో విషాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. రాజేంద్రప్రసాద్ కూతురు గుండెపోటుతో హఠాత్తు మృతి చెందారు.
కూతురు మృతితో రాజేంద్రప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇప్పటికే సినీ ప్రముఖులు, సన్నిహితులు, నటులు రాజకీయ నాయకులు, రాజేంద్రప్రసాద్ ఇంటికి చేరుకుని ఆయనను పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ & ప్రముఖ బీసీ నేత జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి & డాక్టర్ హరి కుమార్ మరియు సీనియర్ జర్నలిస్టులు తదితరులు మంగళవారం రోజున రాజేంద్రప్రసాద్ ను పరామర్శించారు.
