మహానేత వైఎస్సార్ కు ఘన నివాళులు..
మహానేత వైఎస్సార్ (YSR)75వ జయంతి తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. మరోవైపు పంజాగుట్ట సెంటర్ వద్దనున్న ఆయన విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావ్,ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్‌రావు, దానం నాగేందర్,ఎంపీ మల్లు రవి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచందర్రావు, మధుయాష్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి, , బండి సుధాకర్ గౌడ్, సురేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National BC Dal president Dundra kumara Swamy)మాట్లాడుతూ.. వైయస్సార్ జనహృదయనేత, ప్రజల గుండెల్లో నిలిచిపోయే మహోన్నత నాయకుడు, తెలుగు ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేసిన ఘనత ఆయనకే చెందుతుందని తెలిపారు.. 2004 లో పాదయాత్ర చేసి కాంగ్రెస్ ని అధికారంలో తీసుకొచ్చారు. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమైనవని గుర్తు చేశారు..
రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీయింబర్స్‌మెంట్, అంబులెన్స్ సేవలు లాంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలకు వైఎస్ శ్రీకారం చుట్టారని వివరించిన కుమారస్వామి.. వైఎస్సార్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయ సిద్ధాంతాల అమలుకు అందరు కృషి చేయాలని తెలిపారు