మకుటం లేని మహనీయుడు – ఎర్రజెండా సైనికుడు, అందరికీ ఆత్మీయుడు సురవరం సుధాకర్ జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
సిపిఐ మగ్దుమ్ భవన్‌లో ఘన నివాళులు
మకుటం లేని మహారాజు, ఎర్రజెండా సైనికుడు, అందరికీ ఆత్మీయుడైన సురవరం సుధాకర్ గారికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఘనంగా నివాళులు అర్పించారు. నీతి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం… మానవతా విలువలతో నిండిన ఈ మహానుభావుడు కమ్యూనిస్టు సిద్ధాంతం, భావజాలానికి జీవితాంతం కట్టుబడి పోరాడారు.
బడుగు, బలహీన వర్గాలు, శ్రామికులు, కార్మికుల హక్కుల కోసం పోరాడిన ఆయన రైతు, కూలి, కష్టజీవుల పక్షాన నిలిచిన మహోన్నత నాయకుడు.
సామాజిక న్యాయం, సమానత్వమే అందరికీ అందాలని తపనతో జీవించారు. జాతీయ రాజకీయాల్లో తన ప్రత్యేక ముద్ర వేసిన ఆయన, అవినీతికి అణువంతు అవకాశం ఇవ్వని మచ్చలేని మహానుభావుడిగా సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని గడిపారు. ఎప్పుడూ సాదాసీదాగా, కట్టుబాటుతో జీవించిన ఆయన ప్రజా ఉద్యమాల గడ్డ తెలంగాణలో పుట్టి, ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు
