డిఎస్ మృతి పై ప్రముఖుల నివాళి
రాజకీయ రంగంలో డి. శ్రీనివాస్ఒక దిగ్గజం, ఉమ్మడి ఏపీ పిసీసీ అధ్యక్షుడిగా మంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి డి.శ్రీనివాస్ పాటు పడ్డారు.ఆయన మృతి పై పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. హైదరాబాద్ బంజర హిల్స్ లోని ఆయన నివాసంలో మాజీ మంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షులు డి శ్రీనివాస్ పార్థివ దేహానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ,మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ఎంపీ కృష్ణయ్య, ఎంపీ ఈటల రాజేందర్ జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, సంజీవరావు, తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారన్నారు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి,సంక్షేమానికి ఆయన చేసిన సేవలు కృషి చిరస్పరనీయమని అని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.