ప్రజల సమస్యలు తీర్చే జాయింట్ కలెక్టర్ తిరుపతిరావు ఇంట విషాదం
తన పరిధిలో సమస్యలు ఏవున్నా, ఎవరికి ఇబ్బందులు ఎదురైనా తనవంతు సాయం చేస్తూ ఉంటారు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుపతిరావు. అలాంటి ఆయన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తిరుపతిరావు మాతృమూర్తి హనుమక్క తుదిశ్వాస విడిచారు. హనుమక్కకు ఇటీవల ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని అందరూ భావించారు. అయితే ఆమెను బ్రతికించడానికి వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఆసుపత్రిలోనే ప్రాణాలు విడిచారు. ఈ వార్త తిరుపతిరావు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
హనుమక్క మరణం పట్ల ప్రముఖ జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు. రాంగోపాల్ రెడ్డి మరియు నిర్మాత, బెల్లంకొండ సురేష్, పలువురు రాజకీయ నాయకులు, స్థానిక నాయకులు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.