హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్ నుండి కొండాపూర్ మై హోమ్ మంగళ వైపు వెళ్లే వాహనదారులు కు ట్రాఫిక్ సమస్య పరిష్కారాని కై రైల్వే ట్రాక్ నందు ట్రాఫిక్‌ను ఆటోమెటిగ్గా కంట్రోల్ చేసేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన ఆటోమెటిక్ వ్యవస్థను,కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్,ట్రాఫిక్ ఏ.సి.పి హనుమంత రావు,ట్రాఫిక్ సి.ఐ సుమన్ తొ కలిసి ముఖ్యఅతిథిగా ప్రారంభించిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరేకపూడి గాంధీ .ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మంజీర పైప్ లైన్ రోడ్డు లో వైశాలి నగర్ నుండి కొండాపూర్ మై హోమ్ మంగళ వైపు వెళ్లే వాహనదారుల ట్రాఫిక్ సమస్య పరిష్కారానికై ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం శుభపరిణామం అని ,ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వెయిటింగ్ సమస్యకు చెక్,ఇక అంతా ఆటోమెటిక్ అని కూడళ్లలో ట్రాఫిక్ సమస్య కు శాశ్వత పరిష్కారం దిశగా ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థను తీసుకురావడం జరిగినది అని, ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.అదేవిధంగా ప్రజలకు ట్రాఫిక్ రహిత,సుఖవంత మైన ప్రయాణనికి బాటలు వేయడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.ఈ కార్యక్రమంలో హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు వాలా హరీష్ రావు, హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ తెరాస నాయకులు వెంకటేష్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు, గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేర్చుతూ ఇప్పటికే అన్ని రంగాల సంక్షేమం కోసం,...
Read more