• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

పట్టణాలు దేశ, రాష్ట్ర, ఆర్థిక ఇంజన్లు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి -కేటిఆర్

TP NewsbyTP News
29/07/2021
inNews
0
పట్టణాలు దేశ, రాష్ట్ర, ఆర్థిక ఇంజన్లు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి -కేటిఆర్

ప్రణాళికాబద్ధంగా పట్టణాలను అభివృద్ధి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి పురపాలక శాఖ పరిధిలో ఉన్న వివిధ అంశాలపైన జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి శ్రీ కేటీఆర్ పాల్గొన్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ వివిధ రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు, పట్టణాభివృద్ధి నిపుణులతో చర్చించారు. ఆరు గంటలపాటు జరిగిన ఈ విస్తృతస్థాయి మేధోమధన సమావేశంలో పలు అంశాలపైన మున్సిపల్ శాఖ విభాగాల అధిపతులు పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ముఖ్యంగా పట్టణాల ప్రణాళిక రూపొందించే సమయంలో భవిష్యత్ అవసరాలకు సంబంధించి పెద్దపీట వేయాలని ఈ సమావేశంలో పాల్గొన్న పట్టణాభివృద్ధి నిపుణులు సూచించారు. ముఖ్యంగా గతంలోకన్నా భిన్నంగా పట్టణాల అవసరాలు ఉన్నాయని, దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రణాళికలను రూపొందించి ముందుకు పోవాల్సిన అంశాన్ని ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొన్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పట్టణాల అభివృద్ధి పట్ల తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తున్నదని, కేవలం స్వల్పకాలిక లక్ష్యాలతో మాత్రమే కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలతో పట్టణాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆ దిశగా రాష్ట్రంలోనే అతిపెద్ద పురపాలిక అయిన హైదరాబాద్ నగరంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అనేక మౌలిక వసతుల కార్యక్రమాలను, ప్రాజెక్టులను చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

పట్టణ ప్రణాళిక తయారీలో దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న ఆదర్శవంతమైన పద్దతుల పైన మహారాష్ట్ర, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇతర పట్టణ అభివృద్ధి నిపుణులతో ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ చర్చించారు. పట్టణాలు దేశ, రాష్ట్ర ఆర్థిక ఇంజన్లు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, పట్టణాల్లో అభివృద్ధి మరింత ప్రణాళికబద్ధంగా జరిగేందుకు చేపట్టే ప్రక్రియ నిరంతరమైనదని, దీన్ని ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితులు, ఆయా పట్టణాల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందుకు పోవాల్సి ఉంటుందని, ఈ దిశగా తెలంగాణ మున్సిపల్ శాఖ కూడా సంసిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

పట్టణాభివృద్ధి, భవిష్యత్ ప్లానింగ్ కి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆదర్శవంతమైన పద్ధతులు, చట్టాలను అధ్యయనం చేసేందుకు పురపాలక శాఖ ఉన్నతాధికారుల బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు. ఇలాంటి విస్తృతమైన మేధోమధన సమావేశాలను నిర్వహించడం ద్వారా అధికారుల పనితీరు మరింత మెరుగుపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్, భవిష్యత్తులో వివిధ అంశాలపైన ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని, వాటన్నింటికీ తాను స్వయంగా హాజరవుతానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఎ, జలమండలి, డిటిసిపి తదితర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags: GHMCghmc meetingGhmc staffHyderabadkalvakuntla chandra shekar RaoKTRminister ktrmunicipal corporation
TP News

TP News

News

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

by Admin
09/11/2023
0

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...

Read more
బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

15/10/2023
తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

09/10/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News