ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ (ఏడీఆర్) అనే ప్రభుత్వేతర సంస్థ వెల్లడించింది. ఏపీ సీఎం చంద్రబాబు ఆస్తులు రూ. 177 కోట్లని, దేశంలో అత్యంత ధనిక సీఎం చంద్రబాబేనని ఏడీఆర్ తేల్చింది. పెమా ఖండుకి సంపన్న ముఖ్యమంత్రుల్లో రెండో స్థానం లభించింది. పెమాఖండు ఆస్తులు రూ. 129 .57 కోట్లని ఏడీఆర్ వెల్లడించింది. మూడో స్థానంలో పంజాబ్ సీఎం అమరీందర్ నిలిచారు. ఆయనకు రూ. 48.31 కోట్ల ఆస్తులున్నట్లు ఏడీఆర్ తెలిపింది. నాలుగో స్థానంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారు. ఆయన ఆస్తి రూ. 15.15 కోట్లని ఏడీఆర్ తెలిపింది. రూ. 14.50 కోట్లతో మేఘాలయా సీఎం ముకుల్ సంగ్మా ఐదో స్థానంలో నిలిచారు.
అత్యంత పేద సీఎంగా మాణిక్ సర్కార్ నిలిచారు. మాణిక్ సర్కార్ ఆస్తులు రూ. 26 లక్షలని ఏడీఆర్ తెలిపింది. మమతా బెనర్జీ ఆస్తులు రూ. 30. 45 లక్షలు కాగా మెహబూబా ముఫ్తీ ఆస్తులు రూ. 55.96 లక్షలని ఏడీఆర్ వెల్లడించింది. టాప్ టెన్‌లో బీజేపీ ముఖ్యమంత్రులు ఒక్కరు కూడా లేరు.