రాష్ట్రంలో కళలకు, కళాకారులకు కొదవలేదని వారిని ప్రోత్సహించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు
ముఖ్యఅతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , విశిష్ట అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ,అతిధిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి పాల్గొన్నారు
తెలంగాణ గ్రామీణ కళలు అపూర్వమైనవి అని శతాబ్దాలుగా ఈ కళలలను ప్రదర్శించి సమాజానికి బలహీన వర్గాలకు చెందిన కళాకారులకు చేసిన సేవ అమూల్యమైనదని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. ఆదివారం మాదాపూర్ శిల్పకళా వేదికలో ఉదయం 10 గంటలకు శ్రీ శ్రీ త్రిదండి రామానుజ అహోబిల స్వామి వారు జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ నృత్య కళోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు .ఈ కార్యక్రమానికి నిర్వాహకుడు తార ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు సంఖ్య రాజేష్ సమన్వయకర్తగా వ్యవహరించారు.ముఖ్యఅతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , విశిష్ట అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ,అతిధిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ,సినీ నటి హరితేజ ప్రముఖ నృత్య గురువులు డాక్టర్ భాగవతుల సేతురామ్ డాక్టర్ ఆర్ ప్రసన్న రాణి మిస్ ఇండియా అనిషారెడ్డి, మాస్ మహారాజా సినీ నటుడు రవితేజ తండ్రి భూపతి రాజు రాజా గోపాల్ రాజు, పలువురు సినీ తారలు వివిధ రాష్ట్రాలకు చెందిన నృత్య గురువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ జాతీయ జానపద శాస్త్రీయ ఉత్సవాల ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతిభ కీర్తి పురస్కారాలను అందజేశారు. ఆయన వెంట తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పాల్గొన్నారు.ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది .
సాయంత్రం ముగింపు సభలో శాసనసభ స్పీకర్ ప్రసాద్,
బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకళాభరణం కృష్ణమోహన్రావు,జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, ప్రదర్శనలు ఇచ్చిన నృత్య గురువులను పలువురు ప్రముఖ కళాకారులను జ్ఞాపిక శాలువాలతో ఘనంగా సన్మానించారు.
డాక్టర్ వకుళాభరణం ప్రసంగిస్తూ జానపద ప్రదర్శనలో వాటిలో ఉన్న వ్యవహారిక భాషతో ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆ విధంగా ప్రజలు సన్మార్గంలోకి రావడానికి ఆధ్యాత్మికంగా ఎదగడానికి దోహదం చేస్తాయి అని అన్నారు. తెలంగాణ కళలకు కణాచిగా వర్ధిల్లుతున్నదని ఇక్కడి సంస్కృతిక కళా ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి అని అన్నారు ఇక్కడి కళలు మహోన్నతంగా వైవిధ్యమైనవని విభిన్నత కలిగినవని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ జాతీయస్థాయిలో నృత్య ప్రదర్శన హైదరాబాద్ వేదికగా అంగరంగ వైభవంగా జరగడం అద్భుతమైన విషయమని తెలిపారు. తెలంగాణ సాంప్రదాయ, సాంస్కృతి దేశానికి ఆదర్శమని కొనియాడారు.