తొలిపలుకు న్యూస్ (మెదక్): మెదక్ పట్టణంలో మానవత్వం మరచి, విచక్షణారహితంగా చిన్నారి పాపపై తండ్రి నాగరాజు హింసించాడు. ఆ విషయం మెదక్ జిల్లా SP చందనా దీప్తి దృష్టికి రావడంతో, నాగరాజు పైన Cr.No.255/2021 u/s 324 IPC, Sec 75 of JJ act లొ సుమోటో కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించటం జరిగింది.
మెదక్ జిల్లా SP చందనా దీప్తి, దాడి చేయబడ్డ పాపను చూసి పాప తల్లితో, పాపతో మాట్లాడటం జరిగింది. పాపకు ఎక్కెడెక్కడగాయాలు అయ్యాయో పాపను అడిగి తెలుసుకొని, పాపకు మంచి పౌష్టికాహారం అందేలా తల్లితో పాటు ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో ఉండేలా ఏర్పాటు చేశారు. చిన్నారులను హింసించటం, చిన్నారులను పనిలో పెట్టి వేధించటం లాంటివి చేయటం నేరం. ఇలాంటి నేరాలకు పాల్పడే వ్యక్తులను ఎంతటివారైనా వదిలే ప్రసక్తి లేదు అని హెచ్చరించారు.