స్వచ్చమైన వివాదరహిత ప్రజా నాయకుడు జి.వి.ఆర్
జి.వి.ఆర్. గా కుకట్పల్లి నియోజకవర్గంలో దాదాపు స్థానికులందరికి చిరపరిచితుడైన గొట్టు ముక్కల వెంకటేశ్వరరావు గారి జన్మస్థలం కుకట్పల్లి గ్రామం. వారి తల్లిదండ్రులు శ్రీమతి రాజ్యలక్ష్మి- శ్రీ రామారావు గార్లు స్థానికులే కాకుండా వ్యవసాయ ప్రధానమైన వృత్తి లో ఉండేవారు. వారి సంతానం లొ GVR అందరిలోకి చిన్నవారు. విద్యపట్ల కన్నా రాజకీయ అంశాల్లో ఎక్కువ మక్కువ కలిగి ఉండడంతో విద్యార్థిగా ఉండగానే అనేక అంశాల్లో వివిధ విద్యార్ధి సంఘాలతో కలిసి విద్యార్థి సమస్యలపై పోరాడేవారు. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చెయ్యకుండానే వ్యాపార రంగం లోనికి అడుగుపెట్టి రియల్ మరియు కేబుల్ టివి రంగాలలో విజయం సాధించారు.
కుటుంబ నేపధ్యం వ్యవసాయం అయినప్పటికీ, వెంకటేశ్వరరావు గారికి చిన్నప్పటినుండే రాజకీయాలపై అమితమైన ఆసక్తి ఉండడమే కాకుండా నాయకుడిగా ఉండాలనే బలమైన కోరిక ఉండేది. తొలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో దివంగత గౌరవ ఆచార్య జయశంకర్ గారి ప్రత్యేకరాష్ట్ర భావజాలంతో అమితంగా ప్రభావితం అయిన GVR కి రాష్ట్ర సాధనకై అప్పటికే మొక్కవోని కార్యదీక్షతో పోరాడుతున్న కేసిఆర్ మరియు వారి కుటుంబ సభ్యుల అంకిత భావం తనలో ఎంతో పోరాటస్ఫూర్తి నింపింది. వలసపాలనలో అన్నివిధాలుగా నిర్లక్ష్యానికి గురై అభివృద్దికి నోచుకోని తెలంగాణ ప్రాంతానికి ప్రత్యెక రాష్ట్ర ఆవిర్భావమే సరిఅయిన సమాధానమని నిర్ణయించుకొన్న GVR అలుపెరుగని పోరాట యోధుడు ప్రత్యక రాష్ట్ర కాంక్షను ప్రతిఒక్కరిలో రగిల్చిన కేసిఆర్ నెలకొల్పిన టి.ఆర్.ఎస్. పార్టీ వైపు ఆకర్షితులై 2008 లో వారితో ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొని, కుకట్పల్లి మరియు చుట్టుపక్కల ఉన్న అన్ని నియోజకవర్గాలలో వివిధ సంఘాలతో కలిసి ఉద్యమించారు. కుకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, JNTU ప్రాంగణంలో విద్యార్థులను, విద్యార్థి సంఘాలను ఉద్యమానికి సమాయాత్త పరచి అక్కడినుండే తన ఉద్యమయాత్రను తీవ్రతరం చేసారు. నియోజకవర్గం నుండి యువ ఉద్యమనేతగా ప్రాతినిధ్యం వహిస్తూ, ఉద్యమానికి అన్నివిధాలా తనవంతు సహకారాన్ని అందించారు. తను ఉద్యమకాలంలో చుయించిన తెగువ, అందించిన సహాయ సహకారాలవల్ల పార్టీ అధినాయకులతో ఇప్పటికి చక్కని సాన్నిహిత్యం కలిగి ఉన్నారు.
ఇక క్రితంసారి సాధారణ ఎన్నికలలో పార్టీ తరుపున కుకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగ నిలుచొని రెండవ స్థానం లో నిలిచిన గొట్టిముక్కల పద్మారావు గారు అతని సోదరులు. పద్మారావు గారు కుడా అధికార టిఆర్ఎస్ పార్టీలో మంచి పట్టున్న నేత కావడంతో వారి అన్నగారికి చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీ పరమైన కార్యక్రమాలన్నితానై ముందు నడిచి చూసుకునేవారు. టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి నియోజకవర్గంలో విశేషమైన కృషి చేసిన ఆయన, ప్రత్యేక ఉద్యమకాలం ముగిసి తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యాక కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఇతర పార్టీనాయకుల చేరికలతో తమ ఉనికి దెబ్బతిన్నదని భావించిన అనేక అసంతృప్త కార్యకర్తలను పార్టీ విడిపోకుండా నచ్చజెప్పి వారినంతా సమైఖ్యంగా ఉంచగలగడంలో తనదైన శైలిలో వ్యవహరించి కృతకృత్యులయ్యారు.
నిజానికి అంతకు ముందు ఉమ్మడి రాష్ట్ర పాలకులకన్నా విభిన్నమైన ప్రజాకర్షక పధకాలతో ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే అద్భుతమైన పధకాలను అమలుచేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి తన పూర్తి మద్దతు అందించడం అయన ప్రధమ ప్రాధాన్యతా అంశంగా భావించి నియోజకవర్గం లోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోతూ కొత్త కొత్త చేరికలను ఆహ్వానిస్తూ పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేస్తున్న gvr పార్టీ అధినాయకుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నారు. రానున్న శాశనసభ ఎన్నికల నాటికి టిఆర్ఎస్ పార్టీని కుకట్పల్లి నియోజకవర్గం లో ఒక తిరుగులేని శక్తిగా అవతరింప చేయడానికి, ఒకప్పుడు తెదేపా కంచుకోటగా ఉన్న నియోజకవర్గాన్ని గులాబీల సౌరభంతో పూర్తిగా నింపడానికి తన శాయశక్తుల పని చేస్తున్నారు.
పార్టీ కొరకే ఎంతో అంకితభావంతో పనిచేసే ఇటువంటి యువ నాయకులు పార్టీలో గాని ప్రభుత్వంలో గాని ఇప్పటికే సముచిత స్థానాన్ని పొందలేకపోవడం ఆచ్చర్యపరచే విషయమే అయినప్పటికీ ఆ విషయమై పెద్దగా పట్టించుకోకుండా ప్రజలకు సేవ చేయ్యడానికి ఉన్న అవకాశాలలో ప్రత్యక్షరాజకీయాలలో ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ ద్వారా వారికి సేవ చెయ్యడం అలా వీలవకుంటే స్వచ్చందముగా అయినా ప్రజాసేవ చెయ్యాలని తరచుగా ఆలోచించే GVR ప్రజలకు పాలకులకు మధ్య వారధిలా వ్యవహరించేలా ‘ది లీడర్స్’ అనే ఒక స్వచ్చంద సంస్థను స్థాపించి దానిద్వారా సమ సమాజ స్థాపనలో తనవంతు కృషిగా, తన ఆశయాల సాధనకై వ్యక్తిగతంగానే అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ద్వారా ఒక్కసారిగా కుకట్పల్లి నియోజకవర్గం ప్రజలలో ఒక కొత్త ఆలోచనకు విభిన్నమైన చర్చకు తెరతీసారు.
అత్యంత నీటి ఎద్దడి ప్రాంతం అయిన కుకట్పల్లి నియోజక వర్గంలో వేలమంది దాహార్తిని తీర్చే పనిలో భాగంగా అన్ని కూడళ్ళలో, రద్దీగా ఉండే ప్రభుత్వ కార్యాలయాల వద్ద, బస్సు స్టాపుల వద్ద చలివేంద్రాలు నెలకొల్పడమే కాకుండా వాటిని స్వంత ఖర్చులతో నిర్వహిస్తున్నారు. మన పూర్వీకుల నుండి ప్రాచుర్యంలో ఉండి ఎంతో శక్తిని యిచ్చి, చలువచేసే బలమైన ఆహరం, ఆరోగ్య ప్రదాయిని అయిన ‘అంబలి’ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఒక ప్రత్యెక వాహనము ద్వారా నియోజకవర్గం లోని అన్ని డివిజన్లలో రోజు కనీసం రెండువేల మందికి పైబడి పంచుతూ తన సేవా తత్పరతను చాటుకుంటున్నారు. పర్యావరణహిత ప్రభుత్వ పధకం ‘తెలంగాణకు హరితహారం’ కొరకు తన స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో సేవలందించేందుకు తన సభ్యులను ఇప్పటినుండే సమాయత్త పరుస్తున్నారు.
పుట్టుకతోనే ధనిక కుటుంభంలో పుట్టి సామాన్య జీవితం గురించి తెలుసుకోవలసిన అవసరమే లేని ఒక వ్యక్తి సమాజంలో అతి సామాన్య బడుగు బలహీన శ్రామిక పీడిత వర్గాల ప్రజలతో మమేకమై వారి భుజం తట్టి ఆత్మీయంగా పలకరించి కలుపుగోలుగా ఉంటూ అనేక వేడుకలలో వారితో సాముహిక సహపంక్తి భోజనాలు చెయ్యడం వంటి విలక్షణమైన వ్యక్తిత్వంతో ఏంతో మంది హృదయాల్లో ‘GVR అందరివారు’ అనే పేరును సంపాదించుకున్నారు. GVR చాలా మితభాషి, మృదు స్వభావి యే కాకుండా వివాదరహితుడు. సెటిల్మెంట్లు భూతగాదాలు కక్ష్యలు కార్పణ్యాలకు ఆమడ దూరంలో ఉండే gvr ఒక ఉన్నత కుటుంభంలో నుండి వచ్చికుడా ఎటువంటి చెడు వ్యసనాలు లేనివారు కాబట్టే సమాజంలోని అన్ని వర్గాల ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యెకను నిలబెట్టుకోగలిగారు. ఆయన దగ్గరికి వివిధ పనుల్లో మాటసాయం కోసం వచ్చేవారు, ఆరోగ్య సమస్యలతో బాదపడేవారు, ముఖ్యమంత్రి సహాయనిధి యిప్పంచమని వచ్చేవారు, వివిధ కాలనీ సమస్యల పరిష్కారం కొరకు వచ్చేవారితో పాటు ఆర్థిక సహాయం కోసం కుడా వచ్చే వారితో తన కార్యాలయంలో అయినా, ఇంటివద్ద అయినా జనసమూహంతో ఎప్పుడు తీరికలేకుండా కనిపిస్తూ ఉంటారు. వివిధ ప్రభుత్వ సంక్షేమ పధకాలు అర్హులైన లభ్దిదారులకు అందేట్టు చేసే క్రమంలో తానే వారితరుపున కార్యాలయాలచుట్టు తిరిగి పనులు చేయించేవారు. ఆపదలో ఉన్న ఆర్థులకు సకాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఇప్పించడంలో ఎంతో ఆత్మసంతృప్తిని వ్యక్తపరిచేవారు.
పాతిక వేల పైబడి స్వంత కాడర్, అభిమానులు, మద్దతుదారులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు కలిగి ఉన్న GVR అందరి ఆకాంక్ష కోరికల మేరకు ప్రతక్ష రాజకీయాలలో మరింత క్రియాశీలకంగా మారరు.బయట యెంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంభానికి కుడా సమ ప్రాధాన్యం ఇస్తూ కొంత సమయం కుటుంభ సభ్యులతో గడపడానికి కేటాయించుకొని మానసిక వొత్తిడి నుండి ఉపశమనం పొందుతూ సమజీవనం గడపడం అతని బాధ్యతాయుత జీవితానికి నిదర్శనం. gvr తన జీవితంలో ఎన్నో గొప్ప విజయాలు సాధించాలని, తన స్వచ్ఛంద సంస్థ ‘ది లీడర్స్’ ద్వారా ప్రజలకు మేలు చేసే అనేక సేవా కార్యక్రమాలు విస్తృతం చేసి ఒక నిజమైన ప్రజా నాయకుడిగా యింకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిద్దాం.
ఎడిటర్ డెస్క్ , తొలిపలుకు పత్రిక