రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల పరిధిలోని కడియాల కుంట తండా కు చెందిన పాత్యావత్ గోపాల్ (47) లారీ డ్రైవర్. అతని భార్య అంజలి (42) కూతురు స్వాతి (12)తో కలసి హా స్థల్లో ఉన్న తన మరో కూతుర్ని చూడడానికి శంషాబాద్ వైపు వెళ్తున్నారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో జాతీయ రహదారి-44 పెద్ద షాపూర్ గ్రామ పరిధిలోలోకి రాగానే వెనకాల నుంచి ఐచర్ లారీ వేగంగా వీరి బైక్ ని ఢీ కొట్టింది. వారిపై నుంచి లారీ వెళ్ళింది. దీంతో తీవ్ర గా యాలైన ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతి చెందిన భార్యాభర్తలకు ముగ్గురు కూతుర్లు మాధవి, సిదు, మరో కూతురు ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్గం. నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదం లో మృతిచెందారు. ఈ ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది.షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం కడియాలకుంట తండా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరమని బీజేపీ గిరిజన మూర్ఛ అర్బన్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి తెలిపారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జగదీష్ కుమార్ కోరారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more