తొలిపలుకు న్యూస్ : తెలంగాణ రాష్ట్ర, ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖమాన గ్రామంలోగల MPPS పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్న CH.జ్యోతి గారి సోదరుడు జర్మనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో జర్మనీ వారు (St Petronila Parish Germany) ఒకసారి స్థానిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలనుచూసి పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం తమ వంతు కృషిగా పాఠశాల అభివృద్ధికి విరాళాలు సమర్పిస్తూ… మినరల్ వాటర్ ప్లాంట్, బోరు, షటిల్ కోట్, పిల్లలకు టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం పిల్లలకు నోట్ బుక్స్, స్లెట్స్ , పెన్స్ , బాగ్స్ మరియు వంటశాల, డైనింగ్ హాల్ కి నిధులు సమాకూర్చారు. ఈ సందర్బంగా ఈ పాఠశాల అభివృద్ధిలో తను చేస్తున్న నిస్వార్ధ కృషికి ప్రధానోపాధ్యాయురాలుగారైనా CH. జ్యోతి గారిని స్థానిక ZPTC, సర్పంచ్, MEO, గ్రామస్థులు కొనియాడారు. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ..
స్కూల్ ప్రహరీ గోడ నిర్మించాలని, స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం వలన ఇద్దరు విద్య వాలంటీర్ లను నియమించాలని స్థానిక ZPTC మరియు MEO లను కోరడం జరిగింది.
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి హైదరాబాద్:దేశ రాజ్యాంగ నిర్మాత, వంచిత వర్గాల విమోచకుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, అంబేద్కర్...
Read more