మన భాగ్యనగరంలో వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి చెందడం అత్యంత బాధాకరం: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
హైదరాబాద్ నగరంలో ఐదేళ్ల బాలుడిని వీధికుక్కలు చంపేసిన ఘటన అందరినీ కలచివేస్తోందని అన్నారు దుండ్ర కుమారస్వామి. ఒంటరిగా వెళుతున్న బాలుడిపై దాడి చేయడంతో ఆ పిల్లాడు అక్కడికక్కడే చనిపోయిన వీడియోను చూశానని.. ఆ వీడియో చూస్తున్నంత సేపు తనకు కన్నీరు ఆగలేదని అన్నారు దుండ్ర కుమారస్వామి. అంబర్ పేట్ లో ఆదివారం జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తుంటే ఎంతో బాధ కలిగిందని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే టాప్ నగరాల్లో ఒకటిగా మార్చాలని తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రయత్నిస్తూ ఉంటే ఇలాంటి ఘటనలు మన హైదరాబాద్ కీర్తిని మసకబారుస్తూ ఉన్నాయని దుండ్ర కుమారస్వామి చెప్పుకొచ్చారు.
వీధి కుక్కల సమస్యపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించాలని కోరారు దుండ్ర కుమారస్వామి. ఐదేళ్ల బాలుడు ప్రదీప్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు. విశ్వనగరంగా చెప్పుకుంటున్న హైదరాబాద్‌లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని కుమారస్వామి అన్నారు. వీధి కుక్కల సంతతి ఊహించని విధంగా అభివృద్ధి చెందుతోందని.. వాటిని తగ్గించే కార్యక్రమాలు అంత చురుగ్గా సాగడం లేదని అన్నారు దుండ్ర కుమారస్వామి. వీధి కుక్కల నియంత్రణకు స్టెరిలైజేషన్ ఒక్కటే మార్గం.. ఆడకుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు కార్పొరేషన్ల అధికారులు చెపుతున్న మాటలు నమ్మడానికి వీలు లేకుండా పోయిందని, కుక్కల సంఖ్య పెరిగిపోతున్న తీరు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు దుండ్ర కుమారస్వామి.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్ ఓ కారు సర్వీస్ సెంటర్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు.. భార్య జనప్రియ, ఆరేళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడు ప్రదీప్ తో కలిసి అంబర్ పేట ఎరుకుల బస్తీలో నివాసం ఉంటున్నాడని దుండ్ర కుమారస్వామి తెలిపారు. అతడి కుమారుడినే వీధికుక్కలు పొట్టన పెట్టుకున్నాయని కుమారస్వామి అన్నారు. అతడి కుటుంబాన్ని అధికారులు ఆదుకోవాలని, సరైన ఉపాధిని వాళ్లకు కలిగించాలని కోరారు దుండ్ర కుమారస్వామి.