జనాభా లెక్కలు తీయకుండా కేంద్రము బీసీలకు అన్యాయం చేస్తుంది.
కుల గణనపై జాతీయ స్థాయిలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలి
జనగణనలో బీసీ కులాల జనగణన తక్షణమే చేపట్టాలి
తొలిపలుకు న్యూస్ : ఈరోజు బిసి కుల గణన చేపట్టేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు బీసీ దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేశారు.
దేశ వ్యాప్తంగా ఈ సవత్సరం చేపట్ట బోయే జనగణనలో ఎస్సీ ఎస్టీల మాదిరిగానే బిసి కులాల జనగణన చేపట్టలని, జనగణ పై జాతీయ స్థాయిలో ప్రాధాని నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన అఖిల పక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేయాలని బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు.
1931 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం కులాల వారీగా జనగణన నిర్వహిస్తే, నేటి వరకు కేంద్ర ప్రభుత్వలు లెక్కలు తీయడం లేదన్నారు. 2011లో అప్పటి యూపిఏ ప్రభుత్వం కులాల వారిగా లెక్కలు తీసిన నేటి వరకు వాటిని ప్రకటించ లేదన్నారు. ఇప్పటికే కులగణన చేపట్టాలని బిహార్, ఒడిసా, తమిళనాడు రాష్ట్రల అసెంబ్లీలో తీర్మానం చేశారని, దేశంలో 18 రాజకీయ పార్టీల నేతలు మద్దతు ప్రకటిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ గారికి లేఖలు కుడా వ్రాశారని ఈ సందర్భంగా కుమారస్వామి గుర్తు చేశారు. దేశంలో కుక్కలకు,నక్కలకు లెక్కలున్నాయని, బిసిలకు మాత్రం లెక్కలు లేకపోవడం చాలా దారుణమన్నారు..
జంతువులకు ఉన్న విలువ బిసిలకు లేక పోవడం చాలా బాధాకరామని కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.