తొలిపలుకు న్యూస్ : దళిత, గిరిజన, బిసి, మైనారిటీ మహిళలకు రక్షణ కల్పించడంలొ ప్రభుత్వం విఫలమైందని అఖిల భారత గిరిజన సమాఖ్య తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలోతు లింగునాయక్ డిమాండ్ చేశారు. నెక్కొండ మండల్ లో అఖిల భారత గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో అంబెడ్కర్ బొమ్మనుండి కొవ్వొత్తులతో నిరసన తెలిపి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఆడపిల్లలపై మానభంగలు,అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి, హైదరాబాద్ సింగరేణి కాలనిలో ‘చిత్ర’ అనే 6 సంవత్సరాల గిరిజన బాలికను హత్యాచారం చేసి చంపేశారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా దళిత, గిరిజన మహిళలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరైన న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు, మహిళలపై అత్యాచారాలు, దాడులు, అరాచకాలు, మానభంగలు లేకుండా ఉన్నప్పుడే దళిత, గిరిజనులకు నిజమైన స్వతంత్రం వచ్చినట్టని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నిరోజు గిరిజనులపైన మారణ కాండ ఈ రాష్ట్రంలొ హత్యాచార నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలి. బాదిత కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకొని కోటి రూపాయలు ఎక్సగ్రెసియా లేదా ప్రభుత్వ ఉద్యోగం కలిపించాలి అని అఖిల భారత గిరిజన సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలోతు లింగునాయక్ డిమాండ్ చేశారు.
ఈ ఘటన తెలిసిన వెంటనే స్పందించి ర్యాలీ లొ పాల్గొన్న కన్నడ హీరో దివైన్ స్టార్ ఇంద్ర, మాట్లాడుతూ హత్యాచారం చేసిన దుందగిడికి కఠినంగా శిక్షించాలని మన దేశంలో ఎక్కడా చూసిన అడుగడుగునా ఎలాంటి గోరాలు జరుగుతూనే ఉన్నాయి వీటిని ఆపడానికి ఎన్ని చట్టాలు వచ్చిన అపలేకపోతున్నారు మనలోతిరుగుతున్న మానవ మృగలద ఈ చట్టలడా అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో AITF జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ నాయక్, మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్, మండల్ సెక్రటరీ వెంకన్న నాయక్, నెక్కొండ వార్డ్ సభ్యులు సింగ్గం ప్రశాంత్,పులిశెట్టి భాను, గిరిజన నాయకులు జీవన్, భూక్య బాలాజీ నాయక్ పాల్గొన్నారు.