జపాన్: జపాన్ దేశం టోక్యోలో నేటి నుంచి ప్రారంభం కానున్న 32వ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ దేశాలు పాల్గొనే ఒలింపిక్స్, విశ్వానికి శాంతి సౌభ్రాతృత్వాలను విరజిమ్మే ఆటల సింగిడికి ప్రతిరూపంగా నిలుస్తాయని సీఎం అభివర్ణించారు. ఒలింపిక్స్ క్రీడల్లో విజయాలు సాధించి, స్వర్ణాలతో పాటు పలు పతకాలు గెలిచేలా క్రీడాకారులకు శుభం జరగాలని సీఎం కోరుకున్నారు. భారత దేశ కీర్తి పతాకాన్ని విశ్వవేదికపై మరోసారి ఎగరేయాలని సీఎం ఆకాంక్షించారు.
సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం
సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...
Read more