యాదవ బిడ్డ ప్రాణం నిలిపిన నందమూరి బాలకృష్ణకు కృతజ్ఞతలు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆయన ఎవరినైనా కొడితే చాలు.. ఓ పెద్ద రాద్ధాంతం చేస్తుంటారు. కానీ ఆయన చేసిన మంచిని చాలా తక్కువ మంది మాత్రమే బయట పెడుతూ ఉంటారు. తాజాగా ఓ యాదవ బిడ్డ ప్రాణం నిలిపారు నందమూరి బాలకృష్ణ. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్న వ్యక్తి ప్రాణం నిలబెట్టారు. ఆయన చేసిన మంచి పనికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి కృతజ్ఞతలు తెలిపారు.
టాలీవుడ్ కి చెందిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారని తెలుసుకున్న బాలయ్య వెంటనే అతనికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఉచిత వైద్యం అందించి ప్రాణాలను కాపాడారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను వద్ద మహేష్ యాదవ్ అనే ఒక వ్యక్తి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు.అతను రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు. యాదవ బిడ్డ ప్రాణం నిలిపిన నందమూరి బాలకృష్ణకు ధన్యవాదాలు అని దుండ్ర కుమారస్వామి తెలిపారు.
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హాస్పిటల్లో రోగులకు మెరుగైన చికిత్సలు అందించడంతో పాటుగా పేదలకు తన సొంత ఖర్చులతోనే ఆసుపత్రి బిల్లును బాలయ్య చెల్లిస్తూ ఉంటారని దుండ్ర కుమారస్వామి అన్నారు. యాదవ బిడ్డ ప్రాణం నిలబెట్టి ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారని దుండ్ర కుమారస్వామి అన్నారు. యాదవుల తరపునా, బీసీల తరపునా ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు దుండ్ర కుమారస్వామి. మహేష్ యాదవ్ బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి నయం కావాలంటే సుమారుగా 40 లక్షలు అవుతాయని వైద్యులు చెప్పారని, బోయపాటి ద్వారా విషయం తెలుసుకున్న బాలయ్య బాబు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యేలా చర్యలు తీసుకుని ఉచితంగా చికిత్సను చేయించారని దుండ్ర కుమారస్వామి అన్నారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం బాలయ్య బాబు గొప్పతనం అని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి చెప్పుకొచ్చారు.