తెలంగాణ ప్రభుత్వం ఉగాది కానుకగా తీయనైన తెలుగు-తెలంగాణ వెలుగు పుస్తకం
శ్రీ విళంబినామ ఉగాది కానుకగా తీయనైన తెలుగు-తెలంగాణ వెలుగు పేరుతో చిన్న పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ అందజేయనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా భాషా సాంస్కృతికశాఖ ఇంటింటికీ చేరేలా కోటి పది లక్షల పుస్తకాలను ప్రచురించింది.
Teeyanyna Telugu Telangana Velugu2018
ఈ పుస్తకాన్ని శుక్రవారం వరంగల్‌లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆవిష్కరించారు. అన్నీ జిల్లాల్లో ఆదివారం మంత్రులు, కలెక్టర్లు ఆవిష్కరిస్తారు. తెలంగాణ దర్వాజలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని పొందుపరిచి మొదటిపేజీని డిజైన్ చేశారు. మొదటిపేజీ నుంచి చివరిపేజీ వరకు మామిడి తోరణాల చిత్రాలున్నాయి. చివరిపేజీలో తెలంగాణ తల్లి బొమ్మ, తెలంగాణ కళలు ఆకర్షణీయంగా ఉన్నాయి.