రెండు తెలుగు రాష్ట్రాలు కరోనా కొరల్లో చిక్కుకుని ఆక్సిజన్ లేక బెడ్లు దొరకక రోజు ఎందరో ప్రాణాలు కోల్పోతుంటే, పబ్లిసిటీకీ కోసం కోట్లలో ఖర్చుపెట్టే మన తెలుగు హీరోలు మాత్రం ఈ కరోనా కష్టకాలంలో కనుచూపుమేర అయినా కనపడటం లేదు..
మాటలు చెప్పే పెదాల కన్నా…
సాయం చేసే చేతులు మిన్న అనే నినాదాన్ని పక్కన పెట్టి.. ఒక్క రూపాయి ఖర్చుపెట్టకుండా యూట్యూబ్ లో నాలుగు భాషల్లో కరోనా కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి, ఆ వీడియో ద్వారా వచ్చే కాసుల కోసం ప్రయత్నిస్తున్నారే తప్ప, తాము తీసిన సినిమాలు అప్పు చేసి మరీ చూసే అభిమానులు ఎందరో ఆపదలో ఉన్నారనే విషయాన్నే పట్టించుకోవడం లేదు, కనీసం వాళ్ళను ఆదుకుందాం అనే సోయే లేదు.
దేవుడే మనిషి రూపంలో వచ్చినట్లుగా కరోనా మొదట్లో రియల్ హీరో “సోనూసూద్” నిస్వార్థంగా ముందుకొచ్చాడు. తన కెరీర్ లో సంపాదించింది అంతా కరోనాతో బాధపడుతున్న వారి కోసం కార్చుపెడుతూ తన ఆస్తిని సైతం తాకట్టు పెట్టి దేశం అంతటా ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నాడు. కరోనా సెకెండ్ వేవ్ లో రోజుకు 40వేల రిక్వెస్ట్ లు పెడుతున్నారు ట్విట్టర్ లో తమకు సహాయం చెయ్యమని, వారందరికీ సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా ఆదుకుంటున్నాడు..
ఒక మొక్క పెట్టి ఛాలెంజ్ విసిరిన తెలుగు హీరోల్లారా…
ఇప్పటికైనా మేలుకోండి.. మీ అభిమానులకు అండగా నిలవండి, ఈ కష్టకాలంలో మీరిచ్చే సందేశాలతో కాకుండా, ఒక ఆక్సీజన్ సీలిండెర్ లేదా ఒక వెంటిలేటర్ దానం చెయ్యండి, అదే ఇంకొకరికి ఛాలెంజ్ గా విసరండి. అంతే కాని కరోనా కష్టకాలంలో, మీరు మాస్కులు పెట్టుకోండి, సానిటైజర్ వాడండి అని ఉచిత సలహాలు మాత్రం ఇవ్వకండి అని ప్రజలు మండిపడుతున్నారు