తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు హబ్సిగూడ జోన్ లో ఈరోజు జూనియర్ డిగ్రీ యూనివర్సిటీలలో 2483 కోట్ల పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని హబ్సిగూడ జోనల్ ఇంచార్జ్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్ల వెంకటేష్ చారి డిమాండ్ చేస్తూ హబ్సిగూడ లో నిరసన రాలి కార్యక్రమం చేపట్టడం జరిగింది
డిమాండ్స్:-
- ప్రతి డిగ్రీ ఆపై స్థాయి విద్యార్థులకు నెలకు 2 వేల రూపాయలు స్కాలర్షిప్లను నెలనెలా విడుదల చేయాలి
- పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను తగ్గించి పూర్తి ఫీజుల రియంబర్స్మెంట్ ప్రభుత్వమే భరించాలి
- ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీ కి అడ్డుకట్ట చేసేలా నియంత్రణ చట్టం తేవాలి
- ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే అమలు చేయాలి
- ఖాళీగా ఉన్న జూనియర్ డిగ్రీ లెక్చరర్ ఎంఈవో డీఈవో పోస్టులు పోస్టులను వెంటనే భర్తీ చేయాలి
- ఎడిట్ కాలేజీలను ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వపరం చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందని వడ్ల వెంకటేష్ చారి అన్నారు ఈ కార్యక్రమంలో మధు శ్రీకాంత్ మునీందర్ సతీష్ పాల్గొన్నారు