భద్రకాళి అమ్మవారి సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావ్- పూజలు
భద్రకాళి అమ్మవారిని సోమవారం సాయంత్రం రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అమ్మవారి సన్నిధిలో గడిపారు. అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు రాక సందర్భంగా అర్చక స్వాములు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు, అందజేశారు .
ఈ సందర్భంగా డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు
మాట్లాడుతూ అమ్మవారి దర్శనం మధురానుభూతిని ఇచ్చిందని తెలిపారు. మానసికంగా ఆందోళన చెందినప్పుడు అమ్మవారిని ఆయా సందర్భాలలో దర్శనం చేసుకోవడం ఆత్మ సంతృప్తి ఇచ్చిందన్నారు..