తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్య వార్షిక నివేదిక విడుదల
నగరంలోని పార్క్ హోటల్‌లో 2017-18 తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్య వార్షిక నివేదికను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. పలువురు పారిశ్రామికవేత్తలు, ఉత్తమ కంపెనీలకు పారిశ్రామిక అవార్డులను కేటీఆర్ అందజేశారు. పలు కంపెనీలతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2017-18లో 10.4 శాతం తెలంగాణ పారిశ్రామిక వృద్ధి పెరిగిందని తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా రూ.1,23,478 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. పెట్టుబడుల ద్వారా 5 లక్షల 27 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించిందని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 55 శాతం అధికంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
IT & Industries Minister @KTRTRS addressing the gathering at the release of Industries Dept Annual Report 2017-2018 in Hyderabad. pic.twitter.com/ewDHSZXDyS
— Min IT, Telangana (@MinIT_Telangana) June 4, 2018