తెలంగాణ ప్రభుత్వం బీసీల పక్షపాతి – తెలంగాణ రాష్ట్రం లో బీహార్ మాడెల్ కుల గణన అభినందనీయం
*మేడ్చల్ జిల్లా పర్యటనలో భాగంగా కుత్బుల్లాపూర్ లో నాయి బ్రాహ్మణుల ఆత్మగౌరవ భవనాన్ని పరిశీలించిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, వినతి పత్రం ఇచ్చిన నాయకులు*
మేడ్చల్ జిల్లా పర్యటనలో భాగంగా కుత్బుల్లాపూర్ లో నాయి బ్రాహ్మణుల ఆత్మగౌరవ భవనాన్ని పరిశీలించిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి.(Dundra kumara swamy). బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం సహకరించాలి అని కోరుతూ నాయీ బ్రాహ్మణుల నాయకులు దుండ్ర కుమార స్వామకి (వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి (National BC Dal president Dundra kumaraswamy) మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్తా అని అలాగే తెలంగాణ ప్రభుత్వం బీసీల అభివృద్ది కి కట్టుబడి ఉంది అని తెలిపారు . ఇటీవల తెలంగాణ రాష్ట్రం కుల గణన కి చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు అని ఈ సంధర్భంగా గుర్తుకు చేశారు. బీహార్ కుల గణన తరహా లో మన రాష్ట్రంలో కుల గణన చేయడం అభినందనీయం అని తెలిపారు.
2022 సంవత్సరంలో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ కులాల జనాభాను లెక్కించే లక్ష్యంతో కుల-ఆధారిత గణన నిర్వహించింది. ఈ గణన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది, అని జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలిపారు.
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, బీహార్ మాడెల్ కుల గణన చేపడతాము అని చెప్పడం అభినందనీయం అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బి.సిల పక్షపాతి అని కొనియాడారు
బీహార్ రాష్ట్రంలో కుల గణన మొదటి దశలో అన్ని జిల్లాల్లో, బ్లాకుల్లో మరియు పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం కుటుంబాల సంఖ్యను లెక్కించి నమోదు చేశారు, రెండవ దశలో గుర్తించిన కుటుంబాలలో వ్యక్తుల కులం, ఉపకులం, సామాజిక-ఆర్థిక వివరాలను 17 ప్రశ్నల ద్వారా డాటాను ఎనుమరేటర్లు సేకరించారు అని దుండ్ర కుమార స్వామి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో కుల గణన ప్రక్రియ సరిలీకృతం చేసి, సంక్షిప్త సమాచార అధ్యయనం తో తెలంగాణ రాష్ట్రం లో ని వెనుక బడిన తరగతుల ప్రజలను సామాజికంగా, ఆర్ధికంగా , రాజకీయంగా మరియు అన్నీ రంగాలలో ఎదగడానికి కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ దళ్ సలహాదారుడు వి వెంకటరమణ, బీసీ దల్ గ్రేటర్ యూత్ ఉపాధ్యక్షుడు మహేష్, రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణ సంఘం నేతలు ,కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అధ్యక్షులు వెంకటేష్ ,ప్రధాన కార్యదర్శి వి ఎస్ ఆర్ రవి, తులసీరామ్, యాదగిరి అశోక్ ,మల్లేష్, స్వామి, చిటుకుల రవి, నాగరాజ్, ప్రభాకర్ ,రమణ మల్లేష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
పాల్గొన్నారు