- పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని విస్తృత స్థాయిలో ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
- తెలంగాణ ఎలక్ట్రిక్ అండ్ ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020-2030
- ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజును, రోడ్ ట్యాక్స్న పూర్తిగా రద్దు చేసిన ప్రభుత్వం + తెలంగాణ ప్రభుత్వ విధానంతో జోరుగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు
- ఇప్పటివరకు రాష్ట్రంలో 4,568 ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకం.. వాహనదారులకు ఇప్పటివరకు దాదాపు రూ.20 కోట్ల పన్ను మినహాయింపు.
తెలంగాణ : పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఎలక్ట్రిక్ అండ్ ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020-2030 కింద రాష్ట్రంలో ఎలక్ట్రిక్, బ్యాటరీ (ఈవీ) వాహనాలను ప్రోత్సహించడానికి రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేసింది.దింతో తెలంగాణ ప్రభుత్వ విధానంతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు జోరందుకున్నాయి.