కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇళ్ల నుంచి బయటకొస్తే తప్పకుండా మాస్కులు ధరించాలని ఆదేశించింది. సైంటిఫిక్ అధ్యయనం ప్రకారం చాలామందిలో కరోనా సోకినా వ్యాధి లక్షణాలు ఉండట్లేదు. కావునా మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఓ అధ్యయనం ప్రకారం మాస్కుల వినియోగంతో జపాన్‌లో కరోనా కేసుల వ్యాప్తి తగ్గినట్లుగా సమాచారం. దగ్గడం, తుమ్మడం, మాట్లాడే సమయాల్లో వెలువడే తుంపర్లు అవతలి వ్యక్తిపై పడటంతో కోవిడ్-19 భారిన పడుతున్నారు. దీని నివారణకు మాస్కుల వినియోగం ఎంతో ఉపయుక్తమని తెలిపింది. రెండు పొరలుగా ఉండే కాటన్‌తో చేసిన మాస్కుల వినియోగం ఆమోదయోగ్యంగా పేర్కొంది. ముక్కు, నోరు, గదవ ను కవర్ చేసే విధంగా మాస్కులు ఉండాలంది. అదేవిధంగా మాస్కుకు, ముఖానికి ఖాళీ ఉండొందని వెల్లడించింది.
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యం విముక్త, సంచార, అర్థ సంచార జాతుల, కులాల జాతీయ సదస్సులో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు...
Read more