రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరింత పటిష్ఠంగా అమలుచేసేందుకు పోలీస్‌శాఖ టాప్-3 వ్యూహం రచించింది. కొన్నిప్రాంతాల్లో ఎక్కువగా లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్నారనే వార్తల నేపథ్యంలో డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి ఆదేశాలమేరకు త్రిముఖ వ్యూ హాన్ని అమలుచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సై, సీఐ, డీఎస్పీ లేదా ఏసీపీ, ఎస్పీ లేదా డీసీపీ, పోలీస్ కమిషనర్లస్థాయి పరిధిలో ఉల్లంఘన కేసుల సంఖ్య, సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించి ఆయా ప్రాంతాలను టాప్ -3 ప్రాంతాలుగా గుర్తిస్తారు. జనం రద్దీకి గల కారణాలను విశ్లేషిస్తారు. పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.
పరిస్థితులు సున్నితంగా మారుతున్నందున కరోనావ్యాప్తిని నియంత్రించేందుకు పలువ్యూహాల ద్వారా లాక్‌డౌన్‌ను మరింత పటిష్ఠంగా అమలుచేయబోతున్నట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.
పోలీసుల కోసం టెలీ హెల్త్ కన్సల్టేషన్ సర్వీస్
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఏకధాటిగా రోజుల తరబడి విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది, వారి కుటుంబసభ్యుల సంక్షేమం కోసం 20 మంది వైద్యనిపుణుల సహకారంతో టెలీ హెల్త్ కన్సల్టేషన్ సర్వీస్‌ను ప్రారంభించారు.