హైదరాబాద్: క్యూ న్యూస్ ఛానల్ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిలకలగూడ ఠాణాలో నమోదైన కేసులో భాగంగా తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సీతాఫల్‌మండి డివిజన్ మధురానగర్‌కాలనీలో మారుతి సేవా సమితి పేరిట లక్ష్మీకాంతశర్మ జ్యోతిషాలయం నిర్వహకుడి ఫిర్యాదు మేరకు తీన్మార్ మల్లన్నపై పోలీసులు కేసును నమోదు చేశారు. తీన్మార్ మల్లన్న తనకు ఫోన్ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేశాడని జ్యోతిషాలయం నిర్వహకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో తనపై తప్పుడు కథనాలు ప్రచారం చేశాడని పోలీసులకు తెలిపాడు.
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు, గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేర్చుతూ ఇప్పటికే అన్ని రంగాల సంక్షేమం కోసం,...
Read more