విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవాలయం వలె యాదాద్రి కూడా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. ఆ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి పాదాలను ఏకాదశి రోజున దర్శించుకోవాలనే కోరిక పది రోజులకు ముందు కోరుకున్నానని మీడియాతో చెప్పారు. యాదాద్రి ఒక అద్భుతమైన కట్టడమని పేర్కొన్నారు.
ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు అహోబిలం, తిరుమల తిరుపతి దేవాలయాన్ని నిర్మిస్తే ఇప్పటికీ చిరస్థాయిగా ఉన్నాయి. అలాగే హిందువులకు జీవితాంతం గుర్తుండేలా యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ నిర్మించారు. ఈ కాలంలో ఇలాంటి ఆలయాన్ని నిర్మించడం ఒక మహాద్భుతమని స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు.