మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆమె టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కేటీఆర్. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మెదక్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, పద్మాదేవేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...
Read more