శేరిలింగంపల్లి, శనివారం సెప్టెంబర్ 17 కొండాపూర్ లోని సి ఆర్ ఫౌండేషన్ లో సిపిఎం, సిపిఐ నాయకులు ఆమెను కలిసి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ శేర్లింగంపల్లి నాయకులు శోభన్, రామకృష్ణ మాట్లాడుతూ ఆనాటి తెలంగాణ రైతంగ సాయుధ పోరాటంలో వేలాదిమంది ప్రాణాలర్పించి పోరాటం చేసింది కమ్యూనిస్టులు మాత్రమేనని వారు గుర్తు చేశారు. భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం వీరోచిత పోరాటం చేసిన ఫలితంగా నే నిజాం లొంగిపోయాడు అని అన్నారు నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుల మత ప్రాంతాలకు అతీతంగా జరిగిన ఆ రైతంగ పోరాటాన్ని రెండు వర్గాల మధ్య పోరాటంగా చిత్రీకరించే కుట్రలు చేస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉద్యమానికి బిజెపికి ఎలాంటి సంబంధం లేదని వారు తెలిపారు. బిజెపి ప్రభుత్వం భారతదేశ ప్రజల ఐక్యతను భగ్నం చేస్తున్నది అని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫర్తితో మరిన్ని ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని అన్నారు. దొడ్డి కొమురయ్య చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యం లంటి పోరాట యోధులను తెలంగాణా గడ్డ మరిచి పోదు అని అన్నారు.. కేంద్రం లో రాష్ట్రం లో ప్రజా వ్యతిరేక కార్య క్రమాలకు నిరసనగా ఉద్యమాలు చేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో సిపిఎం సిపిఐ నాయకులు కృష్ణ, చందు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న అడిషనల్ డీసీపీ జయరాం
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న ఏసీపి జయరాం శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ లో భారీ వినాయకుడిని మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం దర్శించుకున్నారు .అనంతరం ఆయన...
Read more