బిజెపి కార్పొరేటర్లు వారి అనుచరులతో జిహెచ్ఎంసి ఆస్తులను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని,ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించలేకపోతున్న విషయం బిజెపి కార్పొరేటర్లకు తెలిసినప్పటికీ కావాలనే రాజకీయ పరంగా ఈ రోజు గొడవ చేసారని,ఇలాంటి పనులు సహించరాదని,ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లు చేసిన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని హఫీజ్ పేట్/మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్లు శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర గౌడ్ వెల్లడించారు..
ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజల ఆస్తిని ధ్వంసం చేయడంపై బిజెపి కార్పొరేటర్లు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు,ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రజాస్వామ్య పద్దతిలో అనేక మార్గాలు ఉన్నప్పటికీ మన కార్పొరేషన్ ఆస్తులు మనమే ధ్వంసం చేయడం సరైన చర్య కాదు అని వారు స్పష్టం చేశారు..
మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర గౌడ్ మాట్లాడుతూ..రాజ్యాంగబద్ద పదవిలో ఉండి ఈ విధమైన దాడులకు పాల్పడటం వల్ల ప్రజలకు వ్యవస్థలపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుందని,టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ.కేసీఆర్ గారి నాయకత్వంలో,మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ.కేటీఆర్ గారి దిశానిర్దేశంలో గ్రేటర్ హైదరాబాద్ నగర అభివృద్ధికి నగర మేయర్ శ్రీమతి.గద్వాల్ విజయలక్ష్మి గారి అధ్యక్షతన పక్క ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని,కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో అయినా జూన్ 29న వర్చువల్ ద్వారా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు..
హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి.పూజిత జగదీశ్వర గౌడ్ మాట్లాడుతూ.
జిహెచ్ఎంసి అధికారులు,కార్పొరేటర్లు ప్రజా సమస్యల పై స్పందించి వెంటనే పరిష్కరించటంలో రాజిపడటంలేదని కార్పొరేటర్లు,అధికారులతో సమీక్ష చేసి తాత్కాలిక,శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవడం జరుగుతుందని,మహిళ కార్పొరేటర్లు మరియు మహిళా మేయర నిరంతరాయంగా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టామని తెలిపారు..