ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి
బీఎస్‌ఈ సెన్సెక్స్ 290 పాయింట్ల లాభపడి 35,379 పాయంట్ల వద్ద, నిఫ్టీ 89.95 పాయింట్లు లాభపడి 10,800 పాయింట్ల ను దాటి ముగిశాయి. ఆరంభం నుంచి ఉత్సాహంగా ఉన్న సూచీలు ట్రేడింగ్ చివరి గంటలో మరింత పుంజుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ లో ఏషియన్ పెయింట్స్, హెచ్ పీసీఎల్, వేదాంత, బీపీసీఎల్, టాటా స్టీల్ తదితర సంస్థల షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, టైటాన్ కంపెనీ తదితర సంస్థల షేర్లు నష్టాలు చవిచూశాయి.