*తెలంగాణలో కుల గణన స్వాగతిస్తున్నాం*
*చట్టబద్ధమైన కులగణన – అవసరం-జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి*
*బీసీ కుల గణనతో రిజర్వేషన్లలో న్యాయమైన వాటా దక్కుతుంది*
తెలంగాణలో కులగణన చేయాలని ప్రభుత్వం ముందుకు రావడాన్ని జాతీయ బీసీ దళ్ స్వాగతిస్తోందని దుండ్ర కుమారస్వామి తెలిపారు. త్వరలో కులగణన చేపడతామన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు కుమారస్వామి అన్నారు. ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేయాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కుల గణన ప్రారంభమైందని.. 50 లక్షలకు పైగా బీసీ కుటుంబాల గణన నిర్వహించారని చెప్పారు. ఇక తెలంగాణలో కూడా త్వరలో మొదలవ్వడం శుభపరిణామమన్నారు.
శాస్త్రీయంగా కులగణనకు చట్టబద్ధత లభించే విధంగా కులగణన చేయడం ద్వారా బడుగు బలహీనవర్గాలలో వెలుగులు వస్తాయన్నారు దుండ్ర కుమారస్వామి. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మాట ఇచ్చారని.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణనను చేపట్టబోతున్నామని చెప్పడం.. నిజంగా ఒక శుభసూచకమన్నారు. దశాబ్దాలుగా బీసీలు కోరుకున్నది ఇదేనని.. త్వరలోనే తీరబోతూ ఉండడంతో తమ ఆనందాన్ని అవధులు లేకుండా పోయిందని తెలిపారు. దేశ సంపద సమాజంలోని ప్రతి వర్గానికి న్యాయబద్ధంగా దక్కాలంటే కులగణన ఒక్కటే మార్గమని రాహుల్ గాంధీ చెప్పడం కూడా అభినందనీయమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలో బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.. బీసీ కులాల జనగణనతో పాటు ఐదు
సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలతో బీసీల అభివృద్ధికి కేటాయిస్తామని చెప్పిందన్నారు దుండ్ర కుమారస్వామి. ముఖ్యంగా ఎంబీసీ సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటుతో చట్టబద్ధమైన హోదా కల్పిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచారని.. ఆ దిశగా కూడా అడుగులు వేస్తే బీసీలకు ఎంతో మేలు జరిగినవారవుతారన్నారు దుండ్ర కుమారస్వామి.
