మాదాపూర్ శిల్పారామం లో స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం లండన్ నుండి విచ్చేసిన ప్రవాస భారతియ్యరాలు కుమారి సహన శ్రీధర్ చే భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. తన ప్రదర్శనలో గాయియే గణపతి భజన సావేరి జతిస్వరం , చలియే కుంజనామో పదం ,ఇందేందు వచ్చితివిరా పదం , దేవి స్తుతి అంశాలను ప్రదర్శించారు. కర్ణాటక రాష్ట్రం తుంకూర్ నుండి విచ్చేసిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి శ్రీమతి వాణి వెంకట్ రాము , నిర్మల నాట్య కళానికేతన్ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. మూషిక వాహన, గురు సమర్పణ, వాతాపి, సంకర శ్రీగిరి, బ్రహ్మ్మముక్కటేయ్ , ఓంకారకారిని, శివాష్టకం, జయ జనని శారదేయ్, మహాదేవ శివశంభో,నటేశ కౌతం, బ్రహ్మోస్తావా, మూకాంబికీ, నమో నమో భారతంబే, మంగళం అంశాలను దాదాపు ఇరవై మంది కళాకారులు తుంకూర్ నుండి విచ్చేసి ప్రదర్శించారు.
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more