శిల్పారామం మాదాపూర్ లో స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చేనేత చీరలను కొనుగోలు చేయడానికి మహిళలు చాల ఆసక్తి చూపిస్తున్నారు.. కోట, కోర, జాంధానీ, బెంగళూరు సిల్క్, మదనపల్లి, చెందేరి సిల్క్, కాటన్, కాశ్మీరీ సిల్క్, చీరలు, డ్రెస్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. మహిళా సిబ్బంది మరియు సందర్శకులు బతుకమ్మ ఆటను మరియు దాండియా ఆటను ఎంతో సందడి సందడిగా ఆడుకుంటున్నారు. మంగళవారం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీమతి లక్ష్మి శంకర్ శిష్య బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. గణేశా పంచరత్న, పార్వతి నందనం, గీత రాసికీ, రాముడు రాఘవుడు, కామాక్షి స్తుతి, యోగ యోగేశ్వరి, జతిస్వరం, భ్రమరాంబ అష్టకం, మంగళం అంశాలను ఆశ్రిత , గాయత్రీ, లాస్య, రితిక, సాహితి, శ్రీ వాణి, శ్రీనీతి మొదలైన వారు ప్రదర్శించారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more