ఎం కె స్టాలిన్ డిఎంకె అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక
డిఎంకె అధ్యక్షుడిగా ఎంకె స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ సమావేశమైన డిఎంకె కార్యవర్గ సమావేశం స్టాలిన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. పార్టీ కోశాధికారిగా దురై మురుగన్ ఎన్నికయ్యారు. డిఎంకె ప్రధాన కార్యదర్శి ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. 50 ఏళ్ల తరువాత డిఎంకె అధ్యక్షుడి పదవికి ఎన్నికలు జరిగాయి. 70 ఏళ్ల డిఎంకె చరిత్రలో మూడవ అధ్యక్షుడిగా స్టాలిన్ ఎన్నికయ్యారు.