యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రహ్మణపల్లి గ్రామంలో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో వలిగొండ మండలం నాగారం గ్రామానికి చెందిన పెద్దగోళ్ళ శ్రీశైలం (32) మృతి చెందాడు. హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసముంటున్నాడు అయితే ఈ రోజు తన సమీప బంధువుల శుభకార్యానికి హాజరై వృత్తి రీత్యా హైద్రాబాద్ కి తిరుగు ప్రయణమవ్వగా బీబీనగర్ మండలం బ్రహ్మణపల్లి లో లారీ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more