దుబాయ్ అధికారులు ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను విడుదల
శ్రీదేవి మరణానికి సంబంధించి దుబాయ్ అధికారులు ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను విడుదల చేశారు. ఆమె ప్రమాదవశాత్తు మృతి చెందిందని, ఇందులో ఎలాంటి కుట్ర లేదని తేల్చి చెప్పారు. అయితే ఆమె రక్త నమూనాల్లో ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదవశాత్తు ఆమె బాత్‌టబ్‌లోని నీళ్లలో మునిగి చనిపోయిందని డెత్ సర్టిఫికెట్‌లో వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదిక రావడంతో ఇక ఆమె మృతదేహాన్ని అప్పగించే ప్రక్రియ వేగవంతం కానుంది. ఆమె పాస్‌పోర్ట్‌ను రద్దుచేయడం, డెత్ సర్టిఫికెట్ ఇవ్వడంలాంటి పనులు ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లన్నీ అందుకున్న తర్వాత మృతదేహాన్ని అప్పగించనున్నారు. మరో గంటలో కుటుంబ సభ్యుల చేతికి శ్రీదేవి మృతదేహం ఇచ్చే అవకాశం ఉంది.
#FLASH Forensic report says, #Sridevi died from accidental drowning (Source: UAE's Gulf News) pic.twitter.com/eWXdw1p1ZL
— ANI (@ANI) February 26, 2018