హైదరాబాద్ లొని కూకట్ పల్లిలొ బిసి జాతి బిడ్డ రేగుల రమ్య శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న రేగుల రమ్య బుధవారం రోజున శ్రీచైతన్య బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయింది.ఈ రోడ్డు ప్రమాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది .
ఈ ఘటన వాళ్ళ కుటుంబం శోకసముద్రంలో ముంచింది .ఈ సందర్భంగా బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు పరామర్శించి వారికి ధైర్యం చెప్పి వాళ్ల పక్షాన నిలబడటం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లయ్య గౌడ్ మాట్లాడుతూ చైతన్య కాలేజ్ యాజమాన్యం వారి కుటుంబానికి న్యాయం చేయాలి అని వారికి అన్ని విధాలుగా అండదండలుగా ఉండాలని తెలియజేశారు.మరియు దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఏసురత్నం ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.