- అఖిల బ్రాహ్మణ వికాస సమితి ఆధ్వర్యంలో సమ్మేళనం.
- హాజరైన ఎమ్మెల్సీ సురభి వాణి.
బోడుప్పల్: తెలంగాణ రాష్టంలోని మేడ్చల్ జిల్లా, బోడుప్పల్ మండల పరిధిలో అఖిల బ్రాహ్మణ వికాస సమితి ఆధ్వరంలో సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కారిక్రమానికి ముఖ్య అతిధి గా పీవీ నర్సింహా రావు కుమార్తె నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ సురభి వాణి హాజరు అయ్యారు.
బ్రాహ్మణ కుటుంబాలు అత్యంత ముఖ్య పాత్ర పోషిస్తూ దేవుడికి మనకి వారధి లాగా ఉంటారని అలాంటి బ్రాహ్మణ కుటుంబాలో పుట్టడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. కారిక్రమంలో ముఖ్య అతిధులుగా డిప్యూటీ మేయర్ లక్ష్మి , వివిధ వార్డు కార్పొరేటర్లు హాజరుయారు. ఈ కారిక్రమాన్ని నిర్వహించడం మాకు ఎల్లవేళలో కార్పొరేటర్లు అందుబాట్లో ఉండి మా ఈ కారిక్రమాన్ని విజయ వంతం చేసినందుకు గాను ధన్యవాదులు తెలిపారు అధ్యక్షులు శ్రీనివాస్ రావు, నందన్ కుమార్ జోషి జనరల్ సెక్రటరి.