కూకట్ పల్లి : స్థానిక రామ్ దేవ్ రావు ఆసుపత్రి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సనాతన & సనాతన మహతి సహకారంతో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. కెపిహెచ్ బి ఫేజ్-6 పీవీ. నర్సింహా రావు పార్కులో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రామ్ దేవ్ రావు ఆసుపత్రి సిఇఒ డా. ఎన్. యోబు మాట్లాడుతూ కూకట్ పల్లి ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను పూర్తి సేవాభావంతో అందిస్తున్నామని అన్నారు. నాణ్యమైన వైద్యాన్ని ప్రజలందరికి చేరువ చేయడానికే ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తమ ఆశయానికి తోడ్పాటు అందించిన లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శిబిరంలో రామ్ దేవ్ రావు ఆసుపత్రి వైద్యులు డా. సన్నిత్, సిబ్బంది కల్పన, రమ, ఈశ్వర్, రమ్య, గ్లోబల్ కాలేజీ విద్యార్థులు శిబిరం విజయవంతం కావడంలో సహకరించారు. శిబిరంలో ఉచిత వైద్య సేవలతో పాటు జిఆర్ బిఎస్, బిపి, హిమోగ్లోబిన్, న్యూరోపతి, యూరిన్ టెస్టులతో పాటు ఉచిత కంటి పరీక్షలను నిర్వహించారు. శిబిరనికి 167 మంది ప్రజలు హాజరై ఉచిత వైద్య సేవలను పొందారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్-2 జోనల్ చైర్ పర్సన్ కె. పుల్లారెడ్డి, ప్రెసిడెంట్ యువికె రాజు, సెక్రటరీ బి. రంగారావు, సిహెచ్ ఈశ్వరరావు, సన్యాసి రావు, జిఎంఆర్ రావు, బివి రెడ్డి, ఎం సురేష్, రేఖ రాజు తదితరులు పాల్గొన్నారు.