హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటెల రాజేందర్ ను బర్త్ రఫ్ చేశారు. ఈ విషయాన్ని తెలంగాణా రాష్ట్ర గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సీఎం కేసీఆర్ సిఫారసు మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈటెలను బర్తరఫ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
గత రెండు రోజులుగా మంత్రి ఈటెల పై భూ ఆక్రమణల ఆరోపణలు రావడం.. వాటి మీద ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు ఆదేశించడం.. తరువాత మంత్రి ఈటెల పోర్ట్ ఫోలియో తొలగించడం వంటి పరిణామాలు వేగంగా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈరోజు ఆయనను మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్టుగా ప్రకటన వెలువడటం గమనార్హం. మరి దీనిమీద ఈటెల రాజేందర్ ఏం స్పందిస్తారో వేచి చూడాలి..