● కరోనా కష్టకాలంలో
●కనిపించే దేవుడు మా సోనూభాయ్…
కరోనా కష్టకాలంలో ప్రజల పాలిటి ఆరాధ్యదైవంగా మారినటువంటి సోనూసూద్ మరో మంచి నిర్ణయం తీసుకున్నారు.. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ అందకపోవడం వల్ల ప్రతిరోజు ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం చూసి చలించిపోయిన మన “రియల్ హీరో సోనూసూద్” గారు అవసరమైన అందరికి ఆక్సిజన్ అందిస్తున్నారు.
ప్రతీ ఒక్కరికీ ఆక్సిజన్ అందాలని ఉద్దేశ్యం తో ఒక టోల్ ఫ్రీ నెంబర్ 022-61403615 టోల్ ఫ్రీ నెంబర్ ని విడుదల చేశారు… ఎవరైనా సరే ఈ నెంబర్ కి ఫోన్ చెయ్యొచ్చు, మా వాళ్ళు స్పందించి మీ ఇంటికే వచ్చి ఇస్తారు అని తెలిపారు.. ఈ వార్త విన్న వాళ్లంతా సోనూసూద్ ని కనపడే దేవుడిగా అభివర్ణిస్తూ హర్షం వ్యక్తం చేశారు.. సోనూసూద్ లాగే మిగతా హీరోలందరూ కూడా ముందుకొచ్చి కరోనా కష్టాల్లో ఉన్న అభిమానులకు అండగా ఉండాలని కోరుతున్నారు..