• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News AP

దళిత రైతు కుటుంబంకు ట్రాక్టర్‌ను కానుకగా పంపించిన సోనూసూద్‌

TP NewsbyTP News
27/07/2020
inAP, News, Social
0
Sonu-Sood-AP-Dalit Farmer-Tractor

సోనూసూద్‌! కరోనా లాక్‌డౌన్‌తో కష్టాలు పడుతున్న వలస జీవులను ఆదుకున్న ఈ నటుడు… తాజాగా మరో రైతు కుటుంబానికి బాసటగా నిలిచారు. జోడెద్దులను అద్దెకు తెచ్చుకోలేని పరిస్థితుల్లో… బాలికలే కాడి పట్టిన సంగతి తెలుసుకుని చలించిపోయారు. వారికి ట్రాక్టర్‌ను కానుకగా పంపించారు. ఆదివారం ఉదయం ప్రకటించిన బహుమానం… సాయంత్రానికే ఇంటిముందుకు రావడంతో దళిత రైతు కుటుంబం ఆనందానికి అవధులే లేవు. చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం మహల్‌రాజుపల్లెకు చెందిన వీరదుల్లు నాగేశ్వరరావు ఉపాధి నిమిత్తం మదనపల్లెలో టీ అంగడి నడుపుతున్నారు.ఈయన కుమార్తెలు వెన్నెల ఇంటర్‌, చందన పదో తరగతి పాసయ్యారు. నాగేశ్వరరావు కరోనా లాక్‌డౌన్‌తో కుటుంబాన్ని తీసుకుని స్వగ్రామానికి వచ్చేశారు. ఆయనకు రెండెకరాల వర్షాధార భూమి ఉంది.

Sonu Sood Donated a Tractor to Madanapalle (Andhra Prdesh) Farmer ...

ఈసారి అదునుకు వర్షం పడ్డా వేరుశనగ విత్తేందుకు కూలీలు, నాగళ్లు దొరక్క కుదరలేదు. సొంతంగా ఎద్దులూ లేవు. అదును మించిపోతుండటంతో కనీసం కంది వేద్దామని భావించారు. అయితే, నాగలితో దున్నడానికి రూ.రెండు వేలు అడిగారు. తండ్రి ప్రయత్నాలను గమనిస్తున్న కుమార్తెలు మేమున్నాం… అని ముందుకు వచ్చారు. కాడిని చెరో పక్క పట్టుకుని లాగారు. తండ్రి మేడిపట్టగా… తల్లి విత్తనాలు చల్లింది. తమ కష్టం నలుగురికీ తెలియాలని, మరో నలుగురికి స్ఫూర్తిగా నిలవాలని ఈ దృశ్యాలను వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు.

காலையில் ட்வீட்.. மாலையில் உதவி ...

ఈ విషయం సోనూ సూద్‌ దాకా వెళ్లింది. ఆయన వెంటనే స్పందించారు. ‘‘మీరు చదువుకోండి. రేపటికల్లా కాడెద్దులు మీ గుమ్మం ముందుంటాయి’’ అని ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత… ‘ఎద్దులు కాదు… మీ కుటుంబానికి ట్రాక్టరే కావాలి. ఈరోజు సాయంత్రానికల్లా మీ పొలంలో ట్రాక్టర్‌ ఉంటుంది’’ అని మరో ట్వీట్‌ చేశారు. చెప్పినట్లుగానే… ఆదివారం సాయంత్రమే రూ.8.5 లక్షల విలువైన సోనాలికా ట్రాక్టర్‌ నాగేశ్వరరావు ఇంటి ముందు నిలిచింది. బెంగళూరు నుంచి వచ్చిన సోనూసూద్‌ ప్రతినిధులు వరుణ్‌ కుమార్‌ రెడ్డి, శేషునాథ రెడ్డి ట్రాక్టర్‌తోపాటు వ్యవసాయ పరికరాలు, రూ.5వేల నగదు అందించారు. ‘మీ చదువు నిర్విఘ్నంగా కొనసాగించండి. ఇది సోనూ సూద్‌ ఆకాంక్ష’ అని వెన్నెల, చందనకు చెప్పారు. తన బిడ్డల కాయకష్టం ఇంత మందిని కదిలిస్తుందని ఊహించలేదని నాగేశ్వరరావు దంపతులు భావోద్వేగానికి లోనయ్యారు. వారిని ఉన్నత చదువులు చదివిస్తామని చెప్పారు. సోనూసూద్‌కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే మనసున్న సోనూ సూద్‌ చల్లగా ఉండాలని కోరుకున్నారు.

Tags: Social ServiceSonu Sood
TP News

TP News

మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
News

మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

by TP News
27/01/2023
0

వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...

Read more
సేవా పతకo అందుకున్నా మహమ్మద్ గౌసూద్ధిన్

సేవా పతకo అందుకున్నా మహమ్మద్ గౌసూద్ధిన్

26/01/2023
అల్లాపూర్ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం

అల్లాపూర్ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం

24/01/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News