కరోణా వృద్ధి అంతకంతకూ పెరుగుతూ భయాందోళనలు సృష్టిస్తుంది.అదనంగా ఒమిక్రాన్ కేసులు భయాన్ని పెంచుతుండగా, కరోణా వారూ వీరూ అని తేడాలేకుండా ఎవరినీ వదలడం లేదు. బిగ్బాస్ సీజన్ 5 లో టాప్ 5 కాంటెస్టెంట్ సిరి కి కరోణా పాజిటివ్ వచ్చింది. సిరి తన ఇన్స్టాగ్రాం అకౌంట్ లో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. అయితే తనకు లక్షణాలు ఎక్కువగా లేవని వెల్లడించింది.
అయితే సోషల్ మీడియా లో సిరి పై ట్రోలింగ్ కొనసాగుతోంది. షణ్ముఖ్, దీప్తి సునయన బ్రేకప్ కి సిరి కారణమని,సిరి బిగ్బాస్ లో షణ్ముఖ్ తో అతిగా క్లోజ్ గా ఉండడమే వల్లే వారు విడిపోయారని ట్రోలింగ్ జరుగుతుంది.కాగా షణ్ముఖ్, దీప్తి సునయనల బ్రేకప్ కి తాను కారణం కాదని సిరి చెప్పింది.