వలిగొండ : కరోన విలయతాండవం సృష్టిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ను మరింత కఠినతరం చెయ్యడంతో యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలో స్థానిక S I రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ చేస్తూ ప్రతి కాలనిలో పగలు,రాత్రి గస్తీ నిర్వహిస్తూ కారణం లేకుండా బయటికి వస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేయడం జరుగుతుంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరిస్తూ పోలీసు వారికి సహకరించాలని,ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ వాడాలని అన్నారు.అలాగే కారణం లేకుండా బయటికి వస్తే వారిని ఉపేక్షించేది లేదు అని కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.