వలిగొండ : లాక్ డౌన్ కారణంగా యాదాద్రి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. వలిగొండ SI రాఘవేందర్ గౌడ్ తన సిబ్బందితో కలిసి ఎప్పటికప్పుడు విధులలో పెట్రోలింగ్ చేస్తూ తనిఖీలు నిర్వహిస్తూ, కేసులు నమోదు చేస్తూ, కఠినంగా లాక్డౌన్ నిర్వహించడంతో, వలిగొండ మండల కేంద్రంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సహకారంతో లాక్డౌన్ వియాజయవంతంగా నిర్వహిస్తున్నామని, అనవసరంగా బయటికి వస్తూ పొంతన లేని కారణాలు చెబుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ వారి వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు. సీజ్ చేసిన వాహనాలు వదిలిపెట్టమని ఎవరైనా సిఫార్సు చెయ్యడానికి వస్తే వారిని సైతం ఉపేక్షించేది లేదు అని వారి పట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

ఎస్ ఐ రాఘవేందర్ గౌడ్ చేస్తున్న డ్యూటికి వలిగొండ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము కరోనా బారిన పడకుండా ఉండటం కోసం అహర్నిశలు కష్టపడుతున్న ఎస్ ఐ రాఘవేందర్ గౌడ్ గారికి కి వలిగొండ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు..

