శ్రీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సభ – ప్రముఖులు
హాజరు
శ్రీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అధ్యక్షురాలు పద్మ సారథ్యంలో డాక్టర్ డే సందర్బంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బడుగు బలిహీనవర్గాల ఆశాజ్యోతి బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణ కృష్ణమోహన్, పేదల పెన్నిధి అంధరికి అందుబాటులో వుండే నాయకుడు మాజీ మంత్రివర్యులు సి కృష్ణ యాదవ్, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి, శ్రీ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు గంగాపురం పద్మ, సింగర్ ప్రణయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జాతీయ బీసీ దల్ అధ్యక్షుడు మాట్లాడుతూ శ్రీ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు పద్మఒకవైపు ఉద్యోగం చేస్తూనే సామాజిక అభివృద్ధి మహిళల సంక్షేమము చైతన్యం కోసం, అనునిత్యం అనుక్షణం ప్రయత్నం చేస్తున్న మహిళా శక్తి కి నిలువెత్తు నిదర్శనం పద్మ అని తెలియజేశారు. పట్టుదలతో ప్రయత్నిస్తే చిన్న విత్తనం కూడా భూమిని చీల్చుకొని మహవృక్షంగా ఎదుగుతుందనే అక్షర సత్యానికి నిలువెత్తు నిదర్శనం దివ్యా అని- తెలియచేసారు .ప్రజలందరి ప్రాణాలు కాపాడడానికి, ప్రజలందరి ఆరోగ్యలను కాపాడడానికి నిత్యం శ్రమించే డాక్టర్ వారు నిజమైన హీరోలు. స్త్రీ లేనిది జననము లేదు, స్త్రీ లేనిది గమనము లేదు, స్త్రీ లేనిది ఈ సృష్టి లేదు, ఇధి అక్షర సత్యం.ఎంతో గొప్పదమ్మ స్త్రీ జన్మ అపురూపమైనదమ్మ ఆడజన్మ తెలిపారు. సూర్యుడుని అర చేతితో ఎవరు ఆపలేరు అలాగే ప్రపంచంలో మహిళల శక్తిని ఎవరూ ఆపలేరు ఆడపిల్లగా కాదు అమ్మ ఆధి పరాశక్తి జీవించు అని తెలియచేసారు. మహిళల హక్కుల ఉల్లంఘన ఏదో ఒక రూపన జరుగుతుంధి, మహిళా జీవిత చక్రం చూస్తే మహిళలు పుట్టినప్పుడు నుండి ఏదో ఒక వివక్షకు గురి అవుతూనే వుంటారు, ఆడ శిశుహత్యలు, బాల్య వివాహం, పెళ్లి తరువాత కట్నం, గృహహింస బయటకు వెళితే అత్యాచారాలు, లైంగిక వేధింపు, ఇలాంటి న్యూస్ లేని న్యూస్ పేపర్ లేదు. భారతదేశం సాంప్రదాయలకు నిలువెత్తు నిలయం, వేల సంవత్సరాలుగా స్ర్తీలను దేవతలుగా పూజింపబడుతున్న దేశం. కాని ప్రస్తుతం స్ర్తీలపై జరుగుతున్న దాడులను చూస్తే మహిళల బద్రత ఎక్కడ అని అడిగారు. రాజ్యాంగం మహిళలకు కొన్ని ప్రత్యేక హక్కులను కల్పించింది. ఆర్టికల్15 (1) ద్వారా లింగ వివక్ష చూపించకూడదు. ఆర్టికల్ 39 (డి) పురుషులతో పాటు సమాన వేతనం, వరకట్న నిషేద చట్టం (1961), కనీస వేతన చట్టం (1948), సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం-మహిళ జీరో ఎఫ్. ఐ. ఆర్- ఫోక్సో చట్టము, పలు చట్టాలు మహిళలలు రక్షణ కోసం చేసిన చట్టాలు, వాటి పై పూర్తి అవగాహన పెంచుకోవాలి అని కోరారు.. మహిళల జరుగుతున్నా దాడులు ఘటనలు అత్యాచారాలు,నేషనల్ క్రైమ్ రికర్డ్స్ బ్యూరో ప్రకారం చూస్తే 2019 సం 405861 కేసులు నమోదు అయ్యాయి. అంటే ఎంత విచారణ అని తెలియచేసారు.
భారత రాజకీయ పార్టీలు లాలించే చేతుల మీదుగా పాలన సాగలీ అధి జరగాలంటే
మహిళా బిల్లు’ కు మోక్షం రావాలి అని తెలియచేసారు. మహిళా బిల్లు కోసం పోరాటాలు చేయాలి ,స్త్రీలకు కూడా సమానంగా అవకాశాలు, హక్కులు కల్పించలి. మేముఎంతో మా వాటా అంతే అని ప్రశ్నిచడం మొదలు పెట్టాలి. కేంద్ర ప్రబుత్వము బీసీ బిల్ల్ మహిళా బిల్లు, జనాభా గణన లో కుల గణన కు వ్యతిరేకకంగా పనిచేస్తుంది అని విచారణ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో మహిళలు,కాలనీవాసులు ,పలు నాయకులు పాల్గొన్నారు