“శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే,
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే”
ఈ శ్లోకాన్ని 3 సార్లు చదివితే విష్ణు సహస్రనామం, శివసహస్రనామం రెండూ పారాయణం చేసిన ఫలితం లభిస్తుందని ప్రతీతి.
“శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రేమయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్.
ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి.”
ఈ శ్లోకాన్ని చదవడం వలన మనం చేసే పనులు దిగ్విజయంగా పూర్తిచేసుకుంటామని పురాణాలు చెబుతున్నాయి.
“రామ” నామం అత్యంత శక్తివంతమైన మంత్రం. ఈ శబ్దానికి మన పురాణాల్లో అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ రామ నామాన్ని జపించడం వల్లే కిరాతకుడై ఓ బోయవాడు వాల్మీకి మహర్షిగా రూపొంది రామాయణాన్ని రాసేంటన్త గొప్ప స్థాయికి వెళ్ళగలిగాడు.